English   

తల్లి కాబోతున్న గీతామాధురి

 Geetha Madhuri pregnant
2019-06-19 16:04:24

సింగర్ గీతామాధురి తెలుగు ప్రేక్షకులకి సంగీత ప్రియులకి పరిచయం అక్కర్లేని పేరు. తన గాత్రంతో పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన గీత వాంటెడ్ సినిమాలో మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, బాహుబలి జీవ నది లాంటి సాంగ్స్  ద్వారా మంచి పేరు సంపాదించింది. సినిమా పాటలతో పాటు, స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో పేరు సంపాదించుకున్న గీతామాధురికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే గత బిగ్ బాస్ సీజన్ లో ఆమెను కంటెస్టెంట్ గా కూడా తీసుకున్నారు. అయితే కౌశల్ దెబ్బకి ఆమె ఎలిమినేట్ అయిపోయినా ఆ షో ఆమెకి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే ఆమె త్వరలో తల్లి కాబోతున్నారని సమాచారం అందుతోంది. ఆమెకు ఈమధ్య శ్రీమంతం ఫంక్షన్ కూడా జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ విషయం గురించి ఎవరో మీడియాకి సమాచారం ఇవ్వకపోయినా అందుకు సంబందించిన కొన్ని ఫోటోలను ఫంక్షన్ కి హాజరయిన కొందరు సింగర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సమాచారం బయటకి వచ్చింది. ఇక అత్యంత సన్నిహితులే వచ్చిన ఈ ఫంక్షన్ కి యాంకర్ శ్యామల, సింగర్స్ పరిణిక , అంజనా సౌమ్య , మాళవికలు హాజరైనట్టు సమాచారం. గీత మాధురి నటుడైన నందును ఫిబ్రవరి 9,2014 నాడు ప్రేమ వివాహం చేసుకుంది. 

More Related Stories