English   

బ్రోచేవారెవరురా.. సెట్‌ లేకుండా చేశారు.!! 

Brochevarevarura
2019-06-19 17:10:50

శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్‌ లు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బ్రోచేవారెవరురా’. గతంలో శ్రీ విష్ణు, నివేదా పెతురాజ్ లతో కలిసి మెంటల్ మదిలో తెరకక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.  చలనమే చిత్రము.. చిత్రమే చలనము అనేది క్యాప్షన్ తో నివేదా థామస్‌, నివేదా పేతురాజ్ లు లేడీ లీడ్స్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌ లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే ఈ సినిమా మొత్తాన్ని పూర్తిగా ఒరిజినల్‌ లొకేషన్స్‌లోనే రూపొందించారట. అంటే ఈ సినిమా కోసం కనీసం ఒక్క సెట్‌ కూడా వేయకుండా షూటింగ్ పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే టాలీవుడ్ లో ఇది ఒక రికార్ద్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అందుకంటే ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలు, లేదా డాక్యుమెంటరీలు లాంటివి తప్ప కమర్షియల్‌ సినిమాలు ఇలా పూర్తి ఒరిజినల్‌ లోకేషన్‌లో తెరకెక్కించిడం అనేది చాలా అరుదైన విషయం. అయితే ఇది ప్రచారం కావడంతో నిజం ఎంత అనేది త్వరలోనే తెలియనుంది.

More Related Stories