English   

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెట‌ప్ మార్చేసాడు.. గాల్లో తేలిపోతున్న ఫ్యాన్స్.. 

 Pawan kalyan
2019-06-19 17:35:40

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాడా..? ఈయ‌న ఇంకో సినిమా చేయ‌బోతున్నాడా..? ఎన్నిక‌ల‌కు ముందే మ‌రో సినిమా చేస్తాడా.. అయిన త‌ర్వాత అన్నీ ప్ర‌శాంతంగా ఉన్న టైమ్ లో చేస్తాడా..? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లెందుకు వ‌స్తున్నాయ్ అనుకుంటున్నారా.. ? ఇప్పుడు ఈయ‌న లుక్ చూసిన త‌ర్వాత ఈ డౌట్స్ వ‌స్తున్నాయ్ అంతే. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు గ‌డ్డంతో మునిలా క‌నిపించిన ఈయ‌న‌.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ హీరోగా మారిపోయాడు. ఓ పాప‌తో దిగిన ఫోటో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతుంది. ఇందులో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుర్తుకు రావ‌డం లేదు.. ఒక‌ప్పుడు సినిమా హీరో గుర్తుకొస్తున్నాడు. త‌ను సినిమాలు చేయ‌న‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా కూడా ఇప్పుడు లుక్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ఏదో ఓ సినిమా అయితే క‌చ్చితంగా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా ఈయ‌న కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 

అజ్ఞాత‌వాసి త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చాయంటూ వార్త‌లొచ్చాయి. కానీ తాము ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మంచి స్నేహితుల‌మే అని ఆ మ‌ధ్య ఓ వేడుక‌లో నిరూపించారు ఈ ఇద్ద‌రు. ఇదిలా ఉంటే 2020లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తుంది. దానికి తోడు ప‌వ‌న్ సినిమా క‌చ్చితంగా ఉంటుంద‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా క‌చ్చితంగా చెబుతున్నారు. అంటే క‌చ్చితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ళ్లీ సినిమాల్లో ఊహించొచ్చు. పైగా ప‌వ‌న్ కూడా సినిమాల‌కు రిటైర్మెంట్ అయితే ఇవ్వ‌లేదు. బ్రేక్ ఇస్తున్నాన‌ని చెప్పాడంతే. కానీ ఈ మ‌ధ్య మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పాడు. ఈ క‌న్ఫ్యూజ‌న్ లో అస‌లు ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌ట్నుంచి రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఉండే ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనేది తేల‌నుంది. మొత్తానికి ఈ కొత్త లుక్ సినిమాల‌కే సంకేతం అవుతుందేమో చూడాలిక‌.

More Related Stories