English   

నాగశౌర్యని పరామర్శించిన దర్శకేంద్రుడు...అందుకే అంటారేమో ?

Raghavendra Rao
2019-06-19 18:15:01

ఈమధ్య కాలంలో టాలీవుడ్ కి చెందిన యువ హీరోలు వ‌రుస‌గా ప్ర‌మాదాల బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలోనే టాలీవుడ్ హీరో నాగ శౌర్య‌ కూడా డూప్ లేకుండా చేసిన ఒక యాక్ష‌న్ సీన్‌ లో భాగంగా బిల్డింగ్‌పై నుండి కింద ప‌డి గాయ‌ప‌డ్డాడు. ఆయ‌న ఎడ‌మ కాలికి తీవ్ర‌గాయ‌మవగా ప్ర‌స్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్నారు. 15 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌పై నుండి నాగ‌శౌర్య కింద‌కి దూకే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆయ‌న స‌రైన ప్ర‌దేశంలో ల్యాండ్ కాక‌పోవ‌డంతో ఆయన మోకాలికి పెద్ద గాయ‌మైంది. కేజీఎఫ్ సినిమా ఫేం స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండ‌గా, నాగ‌శౌర్య‌కి గాయం అయింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం ఆయన ఓక నెల రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ లు సూచించారు. అయితే ఈరోజు నాగ‌శౌర్య‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌రామర్శించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశించారు. దర్శకుడిగా మారిన బీవీఎస్ ర‌వి కూడా రాఘ‌వేంద్ర‌రావుతో పాటు ఉన్నారు. నిజానికి ఈ మధ్యనే రాఘవేంద్రరావు ఒక వెరైటీ సినిమా ప్రకటించారు. అదే ఒక సినిమా మూడు కధలు, ఈ మూడు కధలను ముగ్గురు హీరోలను, ముగ్గురు హీరోయిన్స్ ఉండగా ఈ మూడు కధలను ముగ్గురు దర్శకులు తెరకెక్కించనున్నారు. ఇక అందులో ఒక హీరో నాగశౌర్య అని ఒక దర్శకుడు క్రిష్ అని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పెద్దాయనతో బీవీఎస్ రవి కూడా వచ్చి కలవడంతో అయన కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అని అంటారేమో ?

More Related Stories