English   

ఇస్మార్ట్ శంక‌ర్ టైటిల్ సాంగ్.. అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చిన మ‌ణిశ‌ర్మ.. 

Ismart Shankar
2019-06-19 18:26:14

పూరి జగన్నాథ్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నాడు. చాలా కొత్త కథలు ఈ మధ్య కాలంలో ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు ఈ డైరెక్టర్. దాంతో మళ్ళీ పూర్తిగా పోకిరి రోజుల్లోకి వెళ్లిపోతున్నాడు ఈ దర్శకుడు. అప్పట్లో తాను ఎలాంటి సినిమాలు చేసేవాడో మళ్లీ అలాంటి కథల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు రామ్ తో ప్లాన్ చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే వేగంగానే పూర్తి చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. మూడు నెల‌ల్లోనే రామ్ సినిమాకు గుమ్మ‌డి కాయ్ కొట్టేసాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుద‌లైన టైటిల్ సాంగ్ కూడా అదిరిపోయింది. ఇదివ‌ర‌కే వ‌చ్చిన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు విడుద‌లైన టైటిల్ సాంగ్ అయితే పూర్తిగా తెలంగాణ స్టైల్లో పిచ్చెక్కిస్తుంది. దానికి మ‌ణిశ‌ర్మ మాస్ బీట్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో రామ్ పూర్తిగా బ్యాడ్ బాయ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 

రెండు బ్రెయిన్స్ ఉన్న భిన్న‌మైన పాత్ర‌లో రామ్ క‌నిపిస్తున్నాడు. ఒక‌టి మాన‌వ మెద‌డు అయితే.. మ‌రోటి చిప్ అన్న‌మాట‌. ఈ సినిమాకు ఇదే కీల‌కం. ఈ మధ్య కాలంలో పూరి సినిమాలతో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందని హామీ ఇస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావడం ఖాయం అంటున్నాడు ఈ దర్శకుడు. మరోవైపు రామ్ కూడా ఎందుకో తెలియదు కానీ పూరిని కూడా బలంగా నమ్మేశాడు. కచ్చితంగా ఈ సినిమాతో పూరి ఏదో ఒక మాయ చేస్తాడని అభిమానులు కూడా నమ్ముతున్నారు. కచ్చితంగా ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నాడు పూరి జగన్నాథ్. తన నమ్మకం చూస్తుంటే ఈ సారి కచ్చితంగా ఏదో చేస్తాడని అనిపిస్తుంది. మొత్తానికి చూడాలి మరి ఇస్మార్ట్ శంకర్ అయిన పూరి ఆశలను తీరుస్తుందో లేదో. జులై 12న ఈ సినిమా విడుద‌ల కానుంది. దాంతో ప్ర‌మోష‌న్స్ లో కూడా జోరు పెంచేసారు చిత్ర‌యూనిట్.
 

More Related Stories