English   

హాట్ టాపిక్ గా మారిపోయిన అల్లు అర్జున్ కార్వాన్.

Allu Arjun
2019-06-19 18:47:25

ఈ రోజుల్లో హీరోల‌కు కార్వాన్ ఉండ‌టం స‌హ‌జంగా మారిపోయింది. ఒక్కో హీరో ఒక్కో విధంగా త‌న కార్ వ్యాన్ ను సిద్ధం చేసుకుంటున్నాడు. మ‌రీ ముఖ్యంగా కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేసి అత్యంత విలాస‌వంత‌మైన కార్వాన్ ను తెచ్చుకుంటున్నారు మ‌న హీరోలు. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌హేష్ బాబు కార్వాన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు బ‌న్నీ కార్వాన్ కూడా ఇలాగే మారిపోయింది. ఈయ‌న కార్వాన్ ను చూడ్డానికి అభిమానులు ఎగ‌బ‌డుతున్నారు. సాధార‌ణంగా అందులో ఉన్న‌ది ఎవ‌రు.. ఎవ‌రి కార్వాన్ అది అని గుర్తించ‌డానికి టైమ్ ప‌డుతుంది. కానీ బ‌న్నీ మాత్రం త‌న కార్వాన్ బ‌య‌ట 'AA' అని పెద్ద‌గా రాసుకున్నాడు. అంటే అల్లు అర్జున్ అని అర్థం. ఈయ‌న సిగ్నేచ‌ర్ లెట‌ర్స్ చూసిన అభిమానులు ఇది బ‌న్నీదే అని క‌న్ఫ‌ర్మ్ చేసుకుని.. అక్క‌డే ఉండి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

త్రివిక్ర‌మ్ షూటింగ్ స్పాట్ కాస్తా ఇప్పుడు బ‌న్నీ కార్వాన్ అడ్డాగా మారిపోయింది. అక్క‌డికి వ‌చ్చి ఆ కార్వాన్ ను గుర్తు ప‌ట్టి ఫోటోలు దిగుతున్నారు అభిమానులు. అప్పుడప్పుడు బ‌న్నీ కూడా బ‌య‌టికి వ‌చ్చి ఫ్యాన్స్ తో కాసేపు గ‌డిపి వాళ్ల‌కు పోటోలు ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ కార్వాన్ ను ప్ర‌త్యేకంగా బ‌న్నీ డిజైన్ చేయించుకున్నాడు. దీనికోసం నాలుగు కోట్లు ఖ‌ర్చు చేసాడు అల్లు అర్జున్. సాధార‌ణంగా షూటింగ్ బ్రేక్ దొరికితే కార్వాన్ లో వెళ్లి సేద తీరుతుంటారు హీరోలు. ఇది త‌మ‌ది అని తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంటారు. ప్రైవ‌సీ పోకుండా కేర్ తీసుకుంటారు. కానీ బ‌న్నీ మాత్రం ఇది నాదే అని చెప్పుకునే విధంగా త‌న పేరు రాసుకోవ‌డం నిజంగానే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ప్ర‌స్తుతం త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టిస్తున్న సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.

More Related Stories