English   

కొర‌టాల కోసం క‌ష్టాలు ప‌డుతున్న మెగాస్టార్ చిరంజీవి..

Chiranjeevi
2019-06-19 18:54:17

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రాజ‌కీయాలా ఊసే ఎత్త‌డం లేదు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం.150 త‌ర్వాత ఇప్పుడు సైరా కోసం చెమ‌ట చిందిస్తున్నాడు ఈయ‌న‌. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు మెగాస్టార్. ఈ చిత్ర క‌థ అంతా రైతుల చుట్టూ తిరుగుతుంద‌ని తెలుస్తుంది. వాళ్లు ప‌డుతున్న దీన‌స్థితిని క‌థ‌లో చూపించ‌బోతున్నాడు ఈయ‌న‌. భ‌ర‌త్ అనే నేను లాంటి సినిమా త‌ర్వాత కొర‌టాల చేస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా చిరంజీవి, కొర‌టాల కాంబినేష‌న్ అంటేనే ఏదో తెలియ‌ని ఆస‌క్తి క‌నిపిస్తుంది. ఆగష్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే సైరాను పూర్తి చేసి పూర్తిగా కొర‌టాల కోసమే స‌మ‌యం కేటాయిస్తున్నాడు చిరంజీవి. ఇంకా ఓపెనింగ్ కు రెండు నెల‌లు మాత్ర‌మే ఉండ‌టంతో ఇప్ప‌ట్నుంచే డైటింగ్ స్టార్ట్ చేసాడు చిరంజీవి. 

ఇందులో చిరంజీవి స‌న్న‌గా క‌న‌బ‌డాల‌ని కొర‌టాల కోర‌డంతో క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా త‌న బాడీ షేప్ వ‌ర్క‌వుట్ చేస్తున్నాడు చిరు. దీనికోసం రోజుకు రెండు గంట‌లు జిమ్ లో చెమ‌టోడుస్తున్నాడు చిరంజీవి. దాంతో పాటు ప్ర‌త్యేకంగా డైట్ కూడా తీసుకుంటున్నాడు. 64 ఏళ్ల వ‌య‌సులో చిరంజీవి ప‌డుతున్న ఈ క‌ష్టం చూసి అంతా ఫిదా అవుతున్నారు. ఇప్ప‌టికే సైరా కోసం ఇలాంటి భారీ కసరత్తులు చేసాడు చిరంజీవి. ఇప్పుడు కొర‌టాల కూడా ఇదే చేయాల‌ని చెప్ప‌డంతో ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటూ వైద్యులు కూడా మెగాస్టార్ కు స‌ల‌హాలు ఇస్తున్నారు. బ‌రువు త‌గ్గితే మొహంలో గ్లామ‌ర్ పోతుంది.. కానీ ఆ ప్ర‌భావం క‌నిపించ‌కుండా చిరంజీవి ఇప్పుడు యోగా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాతో మ‌రోసారి త‌న మాస్ ప‌వ‌ర్ ఏంటో చూపించాల‌ని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్. అందుకే కొర‌టాల ఏం చెబితే అది చేస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.

More Related Stories