English   

రాజ్ తరుణ్ కొత్త సినిమా...ఆ నలుగురిని ఏమి చేస్తుందో ?

raj
2019-06-19 20:48:17

గుండె జారి గల్లంతయిందే, ఒక లైలా కోసం లాంటి సినిమాలని తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్న విజయ్ కుమార్ కొండా చాన్నాళ్ళగా సినిమాల‌కి దూరంగా ఉన్నాడు. దాదాపు ఐదు సంవ‌త్స‌రాలుగా ఆయ‌న నుండి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ఆ మ‌ధ్య ప్రేమ‌ పెళ్ళి వ‌ల‌న కాస్త పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కావడంతో ఆయన సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు. అయితే ప్ర‌స్తుతం ఆయన పర్సనల్ లైఫ్ అంతా బాగుండగా ఆయన వరుస పరాజయాలతో సమతవుతున్న కుర్ర హీరో రాజ్‌త‌రుణ్‌తో త‌న కొత్త సినిమా ప్రారంభించారు. ఈరోజే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోగా, ఆగ‌స్ట్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు. ఇక ఈ సినిమాని పంతం సినిమాతో గ్యాప్ ఇచ్చిన కెకె రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి గత కొంత కాలంగా సక్సెస్ లేని అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. నిజానికి హీరో  రాజ్ తరుణ్ - డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా అలాగే నిర్మాత కేకే.రాధామోహన్ - అనూప్ రూబెన్స్ వీళ్ళు నలుగురూ హిట్ కోసం పరితపిస్తున్నారు.  ఈ సినిమా ఈ నలుగురికి ఎంతవరకు ఊపు తెస్తుందో చూడాలి మరి.

More Related Stories