English   

హమ్మయ్య...కొబ్బరిమట్ట రిలీజ్ డేట్ చెప్పేశారు

sampu
2019-06-20 09:58:46

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కొబ్బరిమమట్ట. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లో రాజేష్ నీలం అదే నండీ హృదయ కాలేయం డైరెక్టర్ స్టీవెన్ శంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.  2015 నుండే కొబ్బరిమట్ట పోస్టర్స్, టీజర్స్ తో త్వరలో విడుదల అంటూ ఊరిస్తున్న ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ ని జూలై 21న రిలీజ్ చేస్తునట్టుగా ప్రకటిస్తు ప్రమోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ పోస్టర్‌లో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపిస్తూ తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో బిల్డప్ ఇస్తున్నాడు. ఇషికా సింగ్, గీతాంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఇన్ని రోజులకి మోక్షం కలిగిందన్నమాట. ఇక ఈ చిత్రంలో సంపూ.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. పోస్టర్ లో ఉన్న మూడు పాత్రలు అవే అన్నమాట. ఇక ఈ సినిమాకి  కమ్రన్ సంగీతం అందించాడు. సినిమాకి మరో హైలైట్ ఏంటంటే ఆ ఆ… నుంచి బండి రా వరకు వచ్చే అక్షరాలతో ఒక పాత కూడా ఉండనుంది ఈ సినిమాలో.

More Related Stories