English   

బాలయ్య ఫ్యాన్స్ జిల్లా అధ్యక్ష్యుడు జగన్...పేపర్ కటింగ్ నిజమేనా ?

jagan
2019-06-20 10:14:34

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్‌ అయ్యింది. అదేంటంటే 2000 సంవత్సరానికి చెందిన పేపర్ కటింగ్. దీనిలో నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ మూవీ అయిన సమరసింహారెడ్డి సినిమా సంవత్సరం ఆడిన నేపధ్యంలో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పట్లో కడప జిల్లా బాలయ్య ఫ్యాన్స్ అధ్యక్ష్యుడి హోదాలో ఇచ్చినట్టుగా ఉంది, జగన్ అప్పటి ఫొటో కూడా దీనిపై ముద్రించారు. మొత్తం మీద ‘సమరసింహారెడ్డి’ 365 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడి హోదాలో జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ నిజమేనని కొందరు అంటుంటే లేదు మార్ప్ఫ్ చేశారని మరికొందరు అంటున్నారు. నిజానికి బాలయ్యకి జగన్ వీరాభిమాని అని తెలిసిందే, అయినా ఇది మాత్రం ఒరిజినల్ కాదని అంటున్నారు. ఎందుకంటే ఈ పేపర్ యాడ్‌లో ఉన్న జగన్ ఫొటో 2003లో తీసిందట. తన భార్య భారతితో కలిసి ఉన్న ఈ ఫొటోని అది కూడా కలర్ ఫొటోలోని జగన్ ఇమేజ్‌ ను క్రాప్ చేసి తీసుకొని బ్లాక్ అండ్ వైట్‌గా మార్చి ఈ పేపర్ యాడ్‌లో తగిలించేశారని అంటున్నారు. దీని మీద నిజం ఎంత అనేదో స్వయంగా సీఎం క్లారిటీ ఇవ్వాలెమో మరి.

More Related Stories