English   

రాజుగారి గది మళ్ళీ మొదలయ్యింది ఈసారి మూడవది 

raju
2019-06-20 10:25:19

ఓంకార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ సిరీస్‌ లోని మొదటి రెండు సినిమాలు ఎంత బాగా ఆడాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి భాగంలో ఓంకార్‌ సోదరుడు అశ్విన్‌, ధన్య బాలకృష్ణన్‌ జంటగా నటించగా, రెండో భాగంలో అక్కినేని నాగార్జున, సమంత, సీరత్‌ కపూర్‌ లు లీడ్ రోల్స్ చేశారు. ఇక ఇప్పుడు ‘రాజుగారి గది 3’ కూడా రాబోతుందని అందులో తమన్నా లీడ్ రోల్‌ పోషించనుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారమే నిజమయ్యింది ఈరోజు ఈ సినిమా పూజా కార్యకరమాలతో ప్రారంభం అయ్యింది. ప్రచారం జరిగినట్టే రాజుగారి గది 3లో హీరోయిన్ తమన్నా నటిస్తోంది. ఇక ఓంకార్ సోదరుడు అశ్విన్ ఈ సినిమాలో హీరోగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాని ఓంకార్ తన స్వంత బ్యానర్ మీదనే నిర్మిస్తున్నారు. ఈరోజే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపటి నుండి రెగ్యలర్ షూట్ కి వెళ్లనుందిమ్ ఈ సిమని వీలయినంత త్వరగా పూర్తిచేసి విడుదల చేస్తారట. ఇక ఈ సినిమాకి దిల్ రాజు క్లాప్ నివ్వగా, స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ఈ సినిమా కథ మొత్తం తమన్నా చుట్టూ తిరుగుతుందట. మొదటి రెండు భాగాల్లో నటించిన ఆర్టిస్టులు ఈ పార్ట్ లో కూడా కనిపిస్తారు. 

More Related Stories