English   

మగాడిలా కాపురం చేయాలట...ఓ బేబీ ట్రైలర్ !

sam
2019-06-20 12:40:22

సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ఓ బేబీ. డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఓ బేబీ సినిమా కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 5న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ కొద్ది సేపటి క్రితమే విడుదలయ్యింది.  ఓ ఫోటో స్టూడియోకు వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా ఓ డెబ్బై ఏళ్ల పెద్దావిడ పాతికేళ్ల భామ‌గా మారిపోతుంది. ‘తెల్లవారుజామున నాలుగు గంటలకు సన్నటి వర్షం.. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ. బేబీ 70 ఏళ్ల ముసలిది కాదు ఇక 24 ఏళ్ల పడుచు పిల్ల’ అని రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌తో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘దేవుడు మళ్లీ వయసిచ్చాడు. ఆ వయసు మళ్లీ రెక్కలు విప్పుకొంటుంది’ అంటూ సమంత ఏడుస్తూ చెప్పే డైలాగ్‌, తర్వాత ఎలాంటి మొగుడు కావలి ని శౌర్య అడిగితే డబ్బున్న వాడు కావాలి అంటూనే మంచం ఎక్కితే రెచ్చిపోయే వాడు కావాలని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ‘మిస్‌ గ్రానీ’ అనే కొరియన్‌ సినిమాకు ‘ఓ బేబీ’ రీమేక్‌గా రాబోతోంది. ఇందులో ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. సమంత వృద్ధురాలయ్యాక ప్రముఖ నటి లక్ష్మి పాత్రలో కనిపిస్తారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించగా ఈ సినిమాలో నాగశౌర్య కీలక పాత్ర పోషించారు.  

 

More Related Stories