English   

స‌మంత మీద దర్శకేంద్రుడు ప్రశంసల వర్షం

director
2019-06-20 12:59:44

డైరెక్టర్ నందినిరెడ్డి రూపొందిస్తున్న‘ఓ బేబీ’ ప్రపంచవ్యాప్తంగా జూలై 5న రిలీజవుతోంది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజయి అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సందర్భంగా సమంతా మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు తాజాగా త‌న ట్విట్ట‌ర్‌ లో ఈ సినిమాతో పాటుగా స‌మంత నటన మీద కూడా ప్ర‌శంస‌లు కురిపించారు.తాను ఓ బేబి సినిమా చూశానని, సినిమా చాలా కొత్తగా అంతే ఎమోషనల్ గా ఉందని పేర్కొన్నారు. అలాగే స‌మంత‌ 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటిగా నటించిందని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది అని ఆయ‌న పేర్కొన్నారు. కొరియాలో హిట్టైన మిస్ గ్రానీకి తెలుగు ఫ్రీ మేక్‌ గా ఓహ్ బేబీ సినిమా తెర‌కెక్కింది. ఓ ఫోటో స్టూడియోలో ఫోటో దిగడానికి వెళ్ళిన సీనియర్ నటి లక్ష్మి పాతికేళ్ళ సమంతాగా మారిపోతుంది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సినిమా రిలీజయ్యాక ఇంకెన్ని ప్రశంసలు లభిస్తాయో వేచి చూడాలి మరి. 

More Related Stories