English   

అక్షర టీజర్ టాక్

akshara
2019-06-20 17:29:56

ఇంద్ర, గంగోత్రి, బద్రినాద్ లాంటి సినిమాలకి కథా రచయితగా పనిచేసిన చిన్ని కృష్ణ దర్శకుడుగా మారి తెరకెక్కిస్తున్న సినిమా అక్షర. థ్రిల్లర్ జానర్ లో ఈ మధ్య కాలంలో వరసగా సినిమాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభం ఫార్ములాకి ఈ జానర్ ఫేమస్ కావడంతో ఎక్కవ మంది ఈ సినిమాలు చేస్తున్నారు. అలా సస్పెన్స్ జానర్ తో తెరకెక్కిన సినిమా అక్షర. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. టీజర్ మొత్తం అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్ తోనే సాగుతుంది. పెద్దమనిషిగా చలామణి అవుతున్న అజయ్ ఘోష్ తన ఒంటరి జీవితానికి తోడు కోసం టిక్ టాక్ లు చేస్తూ బాధ్యత లేకుండా తిరిగే ముగ్గురు యువకులు సత్య, మధునందన్, శక లక శంకర్ లతో స్నేహం చేస్తాడు. ఆనందంగా గడుపుతున్న వాళ్ళ ప్రపంచంలోకి అక్షర(నందితా శ్వేతా) అనే ఓ అందమైన టీచర్ రాకతో నలుగురూ ఆమెని ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తారు. అయితే ఆమె వల్ల వీరికి అనూహ్యంగా సమస్యలు మొదలవుతాయి. దానితో ఆమెను చంపాలనే నిర్ణయానికి వస్తారు. ఆమెను చంపేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తారు. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపై ఆసక్తిని పెంచుతూ టీజర్ ను కట్ చేశారు. అయితే చివరిలో ఇచ్చిన క్లారిటీ ప్రకారం చదువు కోసం ఆమె ఏదో చేస్తుందని మాత్రం అర్ధమవుతోంది.

More Related Stories