English   

నడిగర్ సంఘం ఎన్నికల రద్దు...అదే రీజన్ ?

sangam
2019-06-20 18:12:24

తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు ఎంతటి రచ్చ రేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్క్కర్లేదు, గత కొద్ది రోజులుగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విశాల్ ప్యానెల్, భాగ్యరాజా ప్యానెల్ అలాగే వీరిని బలపరుస్తున్న వారి వ్యాఖ్యలతో కోలీవుడ్ లో రోజుకో రచ్చ రేగుతోంది. అయితే ఇంకా నాలుగు రోజుల్లో ఎన్నికలు అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు అనుకునే సమయంలో నడీగర్‌ ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. ఈ నెల 23వ తేదీన అంటే ఆదివారం జరగాల్సిన నడిగర్‌ ఎన్నికలను తమిళనాడు రిజిస్టార్‌ ఆఫ్‌ సొసైటీస్‌ నిన్న నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి అసలు ఏం జరిగిందంటే, జూన్ 23న జరగాల్సిన నడిగర్ సంఘం ఎన్నికలను ఎంజిఆర్ జానకి కాలేజ్‌లో నిర్వహించాలనుకున్నారు. అయితే జనసాంద్రత ఎక్కువగా ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తే ట్రాఫిక్‌ జామ్ అవుతుందని, ఎన్నికలను వాయిదా వెయ్యమని మద్రాస్ హైకోర్ట్ చెప్పింది. ఇదే సమయంలో శాల్ బృందం తమ ఓట్లను తొలగించిందని 61 మంది మాజీ సభ్యులు రిజిస్టార్‌కు ఫిర్యాదు చెయ్యడంతో, ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు సొసైటీ రిజిస్టార్ ప్రకటించారు. నడిగర్‌ ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్న నాజర్‌-విశాల్‌, భాగ్యరాజ్‌-ఈశ్వరి గణేషన్‌ ప్యానెల్స్ కి ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయం అనే చెప్పాలి. 61 మంచి చేసిన ఫిర్యాదు మీద విచారణ జరిపి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయిస్తామని సొసైటీ రిజిస్టార్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగేలా చూడాలని కోరుతూ విశాల్ బృందం గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. మళ్ళీ న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లను ఎప్పుడు నిర్వ‌హిస్తారో చూడాలి.

 

More Related Stories