English   

భీష్మ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు

nithin
2019-06-20 18:22:31

హీరో నితిన్ కి వరుస ఫ్లాప్లు వస్తున్న నేపధ్యంలో ఈ సారి ఎలా అయినా  సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇక 'ఛలో' సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల రెండో సినిమా నితిన్ తో చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. నితిన్ పుట్టిన రోజున మిగతా సినిమాలతో పాటే ఈ సినిమా కూడా ప్రకటించారు. ఒక వారం క్రితం చెప్పాపెట్టకుండా సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఆ సినిమా ఈరోజు నుండి రెగ్యులర్ షూట్ కూడా మొదలయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ సినిమాని సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్యాగ్ లైన్ సింగిల్ ఫర్ యేవర్ అని ఉండడం చూస్తుంటే ఇదేదో లవ్ స్టోరీలా అనిపిస్తోంది. భీష్ముడిలాగానే ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోదామనుకున్న యువకుడి జీవితంలో ఎంతో మంది భామలతో లవ్ ట్రాక్ ఎలా నడిపాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకేక్కుతుందని అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ ఈరోజు నుండి భీష్మ షూట్ లో పాల్గొంటున్నానని నితిన్ ట్వీట్ చేశారు. ఏడాది తర్వాత కెమెరా ముందుకు వచ్చానని ఆయన పేర్కొన్నారు.

 

More Related Stories