English   

చైతూ కల నేరవేరిందట

nag
2019-06-20 18:40:13

మ‌జిలీ సినిమా హిట్ కొట్టడంతో మంచి ఫాంలో ఉన్న అక్కినేని హీరో నాగ‌చైత‌న్య ఇటీవ‌ల వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌ తో క‌లిసి వెంకీ మామ‌ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడని రెండ్రోజుల నుండి ప్రచారం మొదలయ్యింది. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్దుందని కూడా ప్రచారం జరగగా దానిని బలపరుస్తూ ఈ సినిమా గురించి తాజాగా నాగ‌చైతన్య ట్వీట్ చేశాడు. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరే సినిమా చేయని శేఖర్ కమ్ములతో కలిసి సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. కెరీర్ మొదటి నుండి శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌లిసి పనిచేయాల‌ని బ‌లంగా కోరుకున్నానని, వారికి అది జ‌రుగబోతోందని ఆయన ట్వీట్ చేశారు. మ‌రో మంచి ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోందని, ఈ సినిమాని ఏసియన్ సినిమాస్ ఓనర్ సునీల్ నారంగ్ నిర్మించ‌బోతున్నారని ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోందని తనకు స‌పోర్ట్‌గా నిలుస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలని నాగ‌చైత‌న్య ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా డిసెంబర్ లో రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు.  

 

More Related Stories