English   

నెటిజన్ కి దిమ్మతిరిగే సమాధానం చెప్పిన సమంతా

Samantha
2019-06-21 11:17:56

అక్కినేని కోడలు సమంత ఓ నెటిజన్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉండే సమంత నెటిజన్ లు అడిగే సరదా ప్రశ్నలకు సరదాగానే స్పందిస్తుంది. కానీ ఒక్కో సారి మితి మీరి మాట్లాడితే మాటేం అదే రేంజ్‌ లో కౌంటర్లు కూడా ఇచ్చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ కి ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న సమంత ఓ బేబీ అనే సినిమాలో నటించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాని జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది సమంత. ఈ వీడియోలో చిన్మయితో పాటు సమంత, నందినీ రెడ్డిలు ఉన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల నుండి మంచి స్పందన రాగా ఓ నెటిజన్ మాత్రం భిన్నంగా స్పందిస్తూ  ఫెమినిస్ట్‌లు అంతా ఒకే దగ్గర ఉన్నారుగా ఈ ఓ బేబీ మూవీ పక్కా ఫ్లాప్ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన సమంత.. ‘హ.. హ.. థాంక్యూ !! వరల్డ్ మీట్ ఇడియట్, ఇడియట్ మీట్ వరల్డ్’ అంటే ప్రపంచం వెధవల దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు.. వెధవలే ప్రపంచం దగ్గరకు వస్తారని అంటూ కర్రవిరక్కుండా పాము చావ కుండా సమాధానం ఇచ్చారు.

More Related Stories