English   

లాయర్ అవుతున్న షాలినీ పాండే...

 Shalini Pandey
2019-06-21 11:28:58

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో హీరోయిన్లయిపోయారు విజయ్ దేవరకొండ, షాలిని పాండే. కానీ విజయ్ కి వచ్చినన్ని అవకాశాలు ఈ భామకి అయితే రాలేదు. ఆ  తర్వాత నుండి ఆమె చిన్న పాత్రలకే పరిమితం అయి మహానటి సినిమా చేసింది. ఇక రీసెంట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా 118 లో నటించింది షాలిని పాండే. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయినా ఎందుకో కానీ షాలిని పాండే కు మంచి బ్రేక్ అయితే రావటం లేదు. అయితే తాజాగా ఈ ముంబై భామ ఒక విభిన్న కధాంశంతో తెరకేక్కే సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మైంది. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌ల‌తో పాటు ఈరోజు రిలీజ్ అవుతున్న ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌ సినిమా హీరో న‌వీన్ పొలిశెట్టి ముగ్గురూ హీరోలుగా న‌టించ‌నున్న సినిమలో షాలిని పాండే క‌థానాయిక‌గా ఎంపికైంది. పిట్ట గోడ ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాని మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో షాలినీ ఓ న్యాయ‌వాదిగా క‌నిపించ‌నుందట. స్క్రిప్ట్ ప‌నులు పూర్తిచేసుకున్న ఈ సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. దీంతో కాస్త ఫేం ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని భావించారు, అయితే ఫేం ఉన్నవాళ్లు కొట్లలో లెక్క అడుగుతుండడంతో ఈ భామని ఫైనల్ చేశారట.

More Related Stories