English   

మారుతి తప్పుకుంటున్నాడా ?

Maruthi
2019-06-21 11:36:50

తెలుగులో బూతులతో యూత్ కి నచ్చే సినిమాలు తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు మారుతి. కాస్త ఫేం రాగానే ఆయన నిర్మాణంలోకి దిగి తన దగ్గర పనిచేసిన అసిస్టంట్ లని దర్శకులని చేసే పనిలో పడ్డారు. అయితే నిర్మాణం చేస్తున్నా తాను కూడా మరో పక్క దర్శకత్వం చేస్తూనే ఉన్నారు. అలా ముందు యూత్ తర్వాత  ఫ్యామిలీలని టార్గెట్ చేసి ఎంటర్టైనర్స్ తెరకేక్కిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి సరిపోయే కధలు చేస్తూ పోతున్నాడు. అలా వచ్చిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలు భారీ విజయాలను అందించాయి. ఆ తరువాత మారుతి ఇతర సినిమాలకి కథలను అందిస్తూ వచ్చాడు. చాలా సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ తన సపోర్ట్ ను అందించాడు. మరికొన్ని సినిమాలకు స్క్రిప్ట్ సహకారం కూడా అందించాడు.  అయితే ఆ సినిమాలేవీ అంతగా ఆడలేదు. అయితే మారుతి బ్రాండ్ పడిన సినిమాలు ప్లాప్ అవ్వడం మొదలెట్టాయి. లండన్ బాబులు, భలే మంచి చౌకబేరమ్, బ్రాండ్ బాబు లాంటి ఎన్నో సినిమాలు మారుతి పేరు ఉన్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడడంతో ఇకపై సమర్పకుడిగా చేయనని తీర్మానించుకున్నాడు మారుతి. ఎక్కువగా ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టడం వలన 'శైలజా రెడ్డి అల్లుడు' ఆశించిన ఫలితాన్ని అందించకుండానే పోయిందని ఆయన అనుకుంటున్నాడట.  అందుకే ఇప్పుడు విడుదలవుతోన్న ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా నుండి కూడా పేరుని తప్పించాడట. 
 

More Related Stories