English   

బిగ్ బాస్ హోస్ నాగార్జునే...ఇవిగో ప్రూఫ్స్

Bigg Boss 3
2019-06-21 12:03:23

తెలుగు బుల్ల్లితెర చరిత్రలో పెనుసంచలనం బిగ్ బాస్. ముఖ్యంగా బిగ్ బాస్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన పని లేదు. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ టీవీలకు అతుక్కుపోయి ఆ రియాలిటీ షోని చూశారు. ఇక బిగ్ బాస్ 2 కూడా ఎన్ని వివాదాల్లో చిక్కున్నా ఎట్టకేలకి అది కూడా విజయవంతమైందనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ 1 అండ్ 2 కు ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా వ్యవహరించిన సంగతి తెల్సిందే. ఇక ఇప్పుడు మూడో సిరీస్ చాలా విభిన్నంగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహ‌కులు. ఇక ఇప్ప‌టికే ప‌లు ప్రోమోలు సిద్ధం చేసుకున్న టీం ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ ఉంది. తాజాగా బిగ్ బాస్ 3 సీజ‌న్‌కి సంబంధించి మ‌రో ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో ఓ క‌థ చెప్తున్న‌ట్టుగా చూపిస్తూ మ‌ధ్య‌లో ఓ వ్యక్తిని ఫేస్ రివీల్ కాకుండా చూపించారు. ఆయ‌న లుక్‌, బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఆయన నాగార్జునే అని ఆయ‌నే ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ అని తేల్చేశారు నెటిజ‌న్స్. అదీ కాక రెండో సీజన్ ని పట్టి కుదిపేసిన లీక్స్ ఈ మూడో సీజన్ మొదలు కాకుండానే మొదలయ్యింది. ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ ప్రోమో షూట్ లో పాల్గొంటున్న వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తుంది. ఆ సెటప్ చూసి కచ్చితంగా బిగ్ బాస్ సెట్ అని చెప్పవచ్చు. సో, బిగ్ బాస్ 3 కి నాగార్జున హోస్ట్ గా ఫిక్స్ అయిపోయినట్టేనని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories