English   

రెజీనా ఎంగేజ్మెంట్...క్లారిటీ ఇచ్చింది

Regina Cassandra
2019-06-21 16:04:12

ప్రముఖ నటి రెజీనా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోన్నసంగతి తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఓ న్యూస్‌ మ్యాగజైన్‌ రెజీనా నిశ్చితార్థం గురించి వరుసగా వార్తలు ప్రచురించడం వాటినే పట్టుకుని నేషనల్ మీడియా సహా అన్నీ వార్తలు వైరల్‌ చేశాయి. ఈ నెల 13న చెన్నైలో కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో రెజీనా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని ఈ ప్రచారం సాగింది. ఇక ఈ ఎంగేజ్మెంట్ తర్వాత వారు ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మీడియాలో రావాడంతో ఈ వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే రెజీనా మాత్రం దీని అలాంటిదేమి లేదనీ, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని చెబుతోంది. ఎలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయొ తెలియదని, ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా చిరాకేస్తుందని, పెళ్లి విషయం తానే ప్రకటిస్తానని తెలిపారు. ఇక రెజీనా ఇటీవల విడుదలైన ‘7’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం ‘కసడదబర’తో పాటు తెలుగులో ‘ఎవరు’ చిత్రంలో నటిస్తోంది.

More Related Stories