English   

త‌ల‌కిందులుగా వేలాడిన మంచు ల‌క్ష్మి.. యోగా అంట‌..

manchu
2019-06-21 19:22:27

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం పాకులాడే అతికొద్ది మంది యాక్ట‌ర్స్ లో మంచు ల‌క్ష్మి ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈమె సినిమాలతోనే కాకుండా బ‌య‌ట కూడా త‌న యాక్టివిటీస్ తో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది మోహ‌న్ బాబు కూతురు. త‌న తండ్రి పేరు చెప్పుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా కూడా టీవీ షోలు, సినిమాలతో మంచు ల‌క్ష్మికి మంచి ఇమేజ్ వ‌చ్చింది తెలుగు ఇండ‌స్ట్రీలో. ఇక ఇప్పుడు యోగా డే సంద‌ర్భంగా విచిత్ర‌మైన పోజు పెట్టి స్టిల్ బ‌య‌టికి విడుద‌ల చేసింది ఈమె. ఇది చూసిన త‌ర్వాత మంచు ల‌క్ష్మికి ఓ ఓ వేసుకోండి అంటూ సంబ‌ర‌ప‌డిపోతున్నారు మంచు ఫ్యాన్స్. ఓ తాడుకు త‌ల‌కిందులుగా వేలాడుతూ మంచు ల‌క్ష్మి ఇచ్చిన పోజు ఇప్పుడు బాగానే వైర‌ల్ అవుతుంది. అంతా యోగా చేయండి అంటూ ఈ పోజుతో ఆమె సందేశాన్నిచ్చింది. అది చూసిన ప్రేక్ష‌కులు వారెవ్వా క్యా పోజ్ హై జీ అంటూ మంచు ల‌క్ష్మిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తానికి గాల్లో ఉండి యోగా డే శుభాకాంక్ష‌లు భ‌లే చెప్పింది ఈ మంచు వార‌మ్మాయి.

More Related Stories