English   

డిశ్చార్జ్ అయిన హీరో శ‌ర్వానంద్.. కొన్ని రోజులు రెస్ట్..

shar
2019-06-21 19:51:00

వారం రోజుల కింద థాయిలాండ్ లో 96 సినిమా రీమేక్ షూటింగ్ లో హీరో శర్వానంద్ గాయపడిన సంగతి తెలిసిందే. దెబ్బ త‌గిలిన వెంట‌నే ఆయ‌న్ని వెంట‌నే హైదరాబాద్ కు వ‌చ్చాడు. అక్క‌డ్నుంచి అలాగే గాయాల‌తోనే ఇండియాకు వ‌చ్చాడు ఈ హీరో. వారం రోజులుగా సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు శర్వానంద్. ఆయ‌న చేతికి, కాలికి గాయాలు కావ‌డంతో ఆప‌రేష‌న్ కూడా చేసారు. స‌ర్జ‌రీ త‌ర్వాత‌ వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్న హీరో శర్వానంద్ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఇంకొన్ని రోజులు ఆయ‌న బెడ్డుకే ప‌రిమితం కాక త‌ప్పదు. 96 రీమేక్ ను ఒరిజిన‌ల్ తెర‌కెక్కించిన ప్రేమ్ కుమారే ఇక్క‌డా తెర‌కెక్కిస్తున్నాడు. స‌మంత అక్కినేని ఇందులో హీరోయిన్ కావ‌డం విశేషం.
త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం ఇక్క‌డ కూడా ఇదే స్థాయిలో ప్ర‌భావం చూపిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు నిర్మాత దిల్ రాజు. ఆయ‌నే ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాడు. శ‌ర్వానంద్ తో శ‌త‌మానం భ‌వ‌తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత కూడా ఆయ‌న చేస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు స‌మంత ఉండ‌టం సినిమాపై ఆస‌క్తి పెంచేస్తుంది. త‌మిళ‌నాట విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించారు ఈ చిత్రంలో. ఇప్పుడు తెలుగులోనూ ఇదే ఏడాది సినిమాను విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అయితే ఇప్పుడు శ‌ర్వానంద్ కు గాయం కావ‌డంతో కొన్ని రోజులు వాయిదా ప‌డేలా క‌నిపిస్తుంది. ఆయ‌న కోలుకున్న త‌ర్వాత తిరిగి 96 రీమేక్ షూటింగ్ మొద‌లు కానుంది.

 

More Related Stories