రాజమౌళికి షాక్ ఇచ్చిన అలియా భట్.. అయ్యో పాపం దర్శకధీర..

రాజమౌళికి ఇప్పుడు చెప్పుకోలేని కష్టాలు వస్తున్నాయి. బాహుబలి తర్వాత భారీ గ్యాప్ తీసుకుని ఈయన మొదలుపెట్టిన ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ అనుకున్నట్లుగా సాగడం లేదు. ఇదే ఇప్పుడు దర్శకధీరుడిని కంగారు పెడుతున్న విషయం. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ ను ఒకే సినిమాలో చూపిస్తున్నాడు దర్శకధీరుడు. పైగా ఇందులో చరణ్ అల్లూరి పాత్రల నటిస్తుంటే.. కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ స్వతంత్ర్యం రాకముందు ఉన్న కథను ఈ చిత్రంలో చూపిస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ కు మాత్రం అనుకోని విధంగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ముందు రామ్ చరణ్ కు గాయం కావడంతో మూడు వారాలు రెస్ట్ ఇచ్చాడు రాజమౌళి.
ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా గాయపడ్డాడు. దాంతో మరికొన్ని రోజులు బ్రేక్ ఇవ్వక తప్పలేదు. ఓ సారి ఎన్టీఆర్, మరోసారి చరణ్ వల్ల షూటింగ్ ఇప్పటికే చాలా రోజుల పాటు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కొన్ని రోజుల నుంచి ఎలాంటి సమస్యా లేకుండా షూటింగ్ సజావుగా సాగుతుందని సంతోషపడుతున్న సమయంలో ఇప్పుడు అలియా భట్ అనారోగ్యం పాలు కావడంతో రాజమౌళి షాక్ లో ఉన్నాడు. బ్రహ్మస్త్ర షూటింగ్ లో బిజీగా ఉన్న అలియాకు అనుకోకుండా తీవ్రమైన జ్వరం వచ్చింది.. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాకు డేట్స్ ఇవ్వలేనని చెబుతుందని తెలుస్తుంది. మొత్తానికి కారణమేదైనా కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ మాత్రం అనుకున్నట్లుగా సాగడం లేదనేది మాత్రం నిజం.