అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో పెళ్లి..

2019-06-21 21:14:01
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే ఈయనకు ఓ పెళ్లి అయింది. ఇక ఈ మధ్యే ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని బయటికి దాచి పెట్టినా కూడా ఇప్పుడు ఫోటోలతో సహా విడుదల చేసారు. నీలు షా అనే అమ్మాయిని బాబీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు కూడా అంతా వచ్చారు. నీలు MBA గ్రాడ్యుయేట్. పూణేలో పూర్తి చేసింది ఈ డిగ్రీని. యోగా డెస్టినేషన్ అనే సెంటర్ ను తన సోదరితో కలిపి నడుపుతుంది నీలు. అయ్యంగార్, అష్టాంగ యోగాను చేస్తుంటుంది నీలు. ముంబైలో పుట్టిన నీలు.. హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది. నీలు తండ్రి కమల్ కాంత్ ఆయిల్ బిజినెస్ మ్యాన్ గా పని చేస్తున్నారు.