English   

సైలెంట్ గా అనుష్క సైలెన్స్.. సూప‌ర్ ఫాస్ట్ షూటింగ్..

anushka
2019-06-21 21:49:47

ఒక్కోసారి కెరీర్ లో తీసుకునే నిర్ణ‌యాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి పూర్తిగా కెరీర్ నే మార్చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు అనుష్క‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. క్రేజ్ చూస్తే ఆకాశ‌మంత ఉంది.. కానీ అవ‌కాశాలు మాత్రం అప్పుడొక‌టి ఇప్పుడొక‌టి వ‌స్తున్నాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇప్పుడు అనుష్క స్టార్ హీరోయిన్ కాదేమో అనిపిస్తుంది. అనుష్క కెరీర్ మొద‌లుపెట్టి ప‌దేళ్లు దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడు కూడా ఇంత బ్రేక్ తీసుకుని ఎర‌గ‌దు. అలాంటిది ఏడాదిగా ఒక్క సినిమా కూడా చేయ‌కుండా ఉంది అనుష్క‌. ఈ మ‌ధ్యే మ‌ళ్లీ సైలెన్స్ అనే సినిమాతో బిజీ అయింది అనుష్క‌.
కోన వెంక‌ట్ క‌థ అందించి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు మ‌ధుక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. అమెరికా బేస్డ్ థ్రిల్ల‌ర్ క‌థ ఇది. ఇందులో మాధ‌వ‌న్ సెల్లో ప్లేయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అంటే పియానో వాయించే పాత్ర అన్న‌మాట‌. ఇక అనుష్క ఆర్ట్ ల‌వ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. దీనికి సైలెన్స్ అనే టైటిల్ దాదాపు క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. ఈ సినిమా కోసం బాగానే బ‌రువు త‌గ్గిపోయింది అనుష్క‌. ఇందులో హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడ్స‌న్ కూడా న‌టిస్తున్నాడు. షాలిని పాండే, సుబ్బ‌రాజు, అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

 

More Related Stories