English   

అరుంధతి సినిమాకి సీక్వెల్ కానీ ఈసారి పాయల్ ?

Payal Rajput
2019-06-22 09:15:30

దాదాపు పదేళ్ళ క్రితం సంక్రాంతి కానుకగా స్వీటీ అనుష్క కథానాయికగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన సినిమా 'అరుంధతి'. హారర్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అరుంధతి-జేజమ్మగా అనుష్క,  పశుపతి పాత్రని సోనూసూద్‌ పోషించారు. ఆరోజుల్లోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా టాప్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ హారర్ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. కానీ అదే నిర్మాణ సంస్థ నుండి మాత్రం కాదు. ఇక ఈ సీక్వెల్ ని శ్రీ శంఖు చిక్ర ఫిల్మ్స్ పతాకంపై కోటి తూముల అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే అరుంధతిలో అనుష్క పోషించిన పాత్రను ఈసారి ఈ సీక్వెల్ లో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పోషిస్తోంది. ఈ సినిమా కోసం పాయల్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద శిక్షణ తీసుకుంటోందట. ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి ఇంకా సరయిన సినిమా ఒక్కటీ తగల్లేదు. ఈ సినిమాతో అయినా ఆమె కోరిక తీరుదుందేమో. ఇక ఈ సినిమాలో పాయల్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన కొందరు స్టార్ నటీనటులు కూడా నటిస్తున్నారట. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్, గ్రాఫిక్స్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో ప్రీ విజువలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ జరుగుతోందన్నారు. త్వరలో షూటింగ్‌ మొదలుకానున్న ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట.

More Related Stories