English   

మరో కాపీ వివాదం...ఈ సారి కల్కి

Kalki
2019-06-22 10:12:22

చాలా కాలం సినిమాలు చేయడమే మానేసిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్, గతేడాది గరుడ వేగ సినిమా తీసి హిట్ కొట్టడంతో మళ్ళీ ఫాంలోకి వచ్చి మరో సినిమా చేస్తున్నాడు. ఆయన ఆ సినిమా తీసి దర్శకుడిగా సత్తా చాటుకున్న ప్రశాంత్ వర్మ దర్శకతంలో కల్కి సినిమా చేశాడు. ఇక ఆ సినిమా త్వరలో రిలీజ్ కానుంది, దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 28వ తేదీన విడుదల చేయడానికి సిద్దమవుతుండగా ఈ సినిమా కూడా కాపీ వివాదంలో చిక్కుకుంది. కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత ఈ కథ తనదేనని చెబుతున్నాడు. రాజ శేఖర్ హీరోగా మహంకాళి సినిమా సమయంలో నేను రాజశేఖర్ కి 'కల్కి' టైటిల్ తో కథ చెప్పానని, స్క్రిప్ట్ కూడా ఆయనకే ఇచ్చేశానని అయితే ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ ఎక్కువవుతుందని, ఇప్పుడు అంత పెట్టలేమని రాజశేఖర్ అన్నారని పేర్కొన్నారు. దాంతో తాను వేరే ప్రయత్నాల్లో ఉండిపోయానని, ఇప్పుడు అదే కథకి కొన్ని మార్పులు చేసి వేరే దర్శకుడిని పెట్టి సినిమా తీసేశారని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ విషయం మీద రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని కానీ రైటర్స్  అసోసియేషన్ వాళ్ళు కల్కి యూనిట్ ను  పిలిస్తే రావడం లేదని నిజానికి కల్కి యూనిట్ నుంచి తాను డబ్బులు ఆశించడం లేదనీ, క్రెడిట్ ఇస్తే చాలని ఆయన చెబుతున్నారు. ఇక తాజాగా ఈ వివాదం గురించి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యుడు, కథా హక్కుల వేదిక కన్వీనర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ కల్కికి సంబంధించి కార్తికేయ అని ఒకరు కంప్లయింట్ చేశారని, తాము కార్తికేయ స్క్రిప్ట్, కల్కి స్క్రిప్ట్ రెండూ చదివామని నిజానికి తమకు ఎటువంటి పోలిక కనిపించలేదని అన్నారు. ఈ సినిమా సోమవారం చూశాక ఈ వివాదం మీద తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

More Related Stories