English   

విరాటపర్వం స్టోరీ లైన్ ఇదేనా ?

Virata Parvam
2019-06-22 12:58:28

బహుబలితో ప్రభాస్, రానాల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభాస్ చాలా సెలక్టివ్ సినిమాలు చేస్తుంటే, రానా మాత్రం చాలా సీలక్టివ్ గా చాలా డిఫరెంట్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తున్న హిట్స్ అందుకుంటు వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో విరాటపర్వం 1992 అనే సినిమా రీసెంట్‌గా లాంచ్ అయింది. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల ఈ సినిమాకి దర్శత్వం వహిస్తున్నాడు. ఇక 1990ల నాటి సామాజిక ప‌రిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెర‌కెక్కించ‌నున్నాడు. పీరియాడిక్ సోష‌ల్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ చిత్రంకి సంబంధించిన క‌థ ఇదే అంటూ ఓక కధ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి రిపోర్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రానా న‌క్స‌లైట్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఓ సంద‌ర్భంలో రానాని ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వెళ్ళి సాయిప‌ల్ల‌వి అత‌ని ప్రేమ‌లో ప‌డుతుంద‌ని, ఆమె వ‌ల‌న రానా న‌క్స‌లిజాన్ని వ‌దిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఎల‌క్ష‌న్‌ లో పోటీ చేసి గెలుస్తాడట. ఇక ఈ సినిమాలో వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ విలన్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌. నిజమెంతో తెలీని ఈ ప్రచారం ఎంత వరకు నిజం అవుతుందో వేచి చూడాలి మరి.
 

More Related Stories