English   

పవన్ నిర్మాత, చరణ్ హీరో ?

Pawan Kalyan
2019-06-22 13:05:54

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యాడు. నిజానికి ఆయన రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమయ్యాడు. అయితే పవన్ ఓటమి పాలవడంతో ఆయన మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం మొదలయ్యింది. అయితే వీటి మీద స్పందించిన పవన్ తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని సినిమాలలో నటించనని స్పష్టం చేశారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయ‌న మ‌న‌సు మాత్రం ఇంకా సినిమాల మీదనే ఉందని అందుకే ఆయన నటించక పోయినా సినిమా నిర్మాణం చేపట్టనున్నాడని అంటున్నారు. నిజానికి మూడేళ్ల కిందే తాను నిర్మాత‌గా మారుతున్న‌ట్లు ప్రకటించారు ప‌వ‌ర్ స్టార్.  అప్పటి నుండే ఓ వార్త సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చ‌ర‌ణ్‌ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నుంద‌ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో అందరూ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన వార్తలు రాలేదు. ఇక మళ్ళీ తాజాగా ఈ ప్రాజెక్ట్ మ‌రోసారి వార్త‌ల‌లోకి వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్‌కి మంచి క‌థ‌ని రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. ఆ సినిమాని చ‌ర‌ణ్ హీరోగా రూపొందిస్తారట. అయితే అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 2020లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళ‌డం ఖాయ‌మట. ఈ సినిమాని ప‌వ‌న్ త‌న సొంత బేన‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌పై రూపొందించ‌నున్నారు. ఇక ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉండ‌గా, త్రివిక్ర‌మ్ మాత్రం బ‌న్నీ 19వ‌ సినిమాతో బిజీగా ఉన్నాడు.

More Related Stories