English   

శేఖర్ కమ్ముల ఇలా హ్యాండ్ ఇచ్చాడేంటి పాపం ?

  Sekhar Kammula
2019-06-22 13:20:12

శేఖర్ కమ్ముల సిద్ధం చేసుకునే కథలు మనసుకు, జీవితాలకి దగ్గరగా ఉంటాయి. అందువల్లనే సాధారణంగా శేఖర్ కమ్ముల పెద్ద హీరోలని బెట్టి సినిమాలు తీయడు. కొత్తవాళ్ళతోనే సినిమాలు చేస్తాడు, బహుశా వారికి పేరు రావచ్చనో, లేక ప్రయోగాలకి పెద్దహీరోలు ఒప్పుకోరనో ఏమో కానీ ఆయన కొత్త వల్లనే ఎంచుకుంటాడు. అందుకేనేమో పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా ఆయన సినిమాలు డీసెంట్ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలా ఫిదా సినిమాతో యూత్ అలాగే ఫ్యామిలీ ప్రేక్షకులని మాయ చేసిన ఆయన, ఆ తరువాత కొత్తవాళ్లతో ఒక సినిమాను మొదలు పెట్టాడు. అయితే ఆ సినిమా గురించి ఎటువంటి ప్రకటనా చేయని ఆయన ఏమయిందో ఏమో కానీ 50 శాతం షూటింగ్  పూర్తయిన తరువాత, హఠాత్తుగా ఆయన చైతూ - సాయిపల్లవిలతో తన కొత్త సినిమాను ప్రకటించాడు. దాంతో ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమా పూర్తయిన తరువాత, చైతూ సినిమాను మొదలెడతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్తవాళ్లతో మొదలుపెట్టిన సినిమాను శేఖర్ కమ్ముల ఆపేశాడనేది ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నిజానికి ఆ సినిమా కూడా సునీల్ నారంగ్ నిర్మాతగా మొదలయ్యింది. అయితే ఈసినిమా యొక్క ఔట్ పుట్ అనుకున్నట్లుగా రాలేదని ఈ సినిమా రషెస్ చూసుకున్న దర్శక నిర్మాతలిద్దరూ హ్యాపీగా ఫీల్ అవలేదని అందుకే నేటి మార్కెట్ కి ఈ మూవీ వర్క్ అవుట్ కాదనే ఉద్దేశంతో దాన్ని మధ్యలో వదిలేద్దామని నిర్ణయించుకున్నారట. ఈమూవీ కి అప్పటికే నాలుగైదు కోట్ల దాకా ఖర్చు పెట్టినప్పటికీ మరింత ఖర్చుపెట్టె ఉద్దేశం లేక ఆ సినిమా ఆపేసారని అంటున్నారు.  కొత్తవాళ్లతో సినిమాలు దర్శకులే అరుదు. అయితే అలాంటి వాళ్లకి శేఖర్ కమ్ముల కూడా హ్యాండ్ ఇస్తే ఇక వాళ్లకు దిక్కెవరు పాపం.

More Related Stories