English   

చిలసౌ హీరోయిన్ కి ఎట్టకేలకి అవకాశం వచ్చింది

 Ruhani Sharma
2019-06-22 13:50:56

గ‌తేడాది సుశాంత్ హీరోగా వ‌చ్చిన "చిలసౌ" సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది క‌దా. ఆ సినిమాలో చాలా అమాయ‌కంగా క‌నిపించిన ఈ మరాఠి భామ తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. అయితే సినిమా బాగానే ఉన్నా కూడా ఎందుకో కానీ కమర్షియల్‌గా మాత్రం వర్కవుట్ కాలేదు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ తెర మీద కనిపించలేదు రుహానీ శర్మ. అయితే సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఆమె గ్లామ‌ర్ షో మొదలుపెట్టి బీచ్, బికినీ అంటూ కొన్ని ఫోటోలు, ఫోటో శూఒట్ లు రిలీజ్ చేసింది. ఇక అంత కష్ట పడ్డ ఈ భామకి తాజాగా హిందీలో ఓ సినిమా ఆఫర్ వచ్చిందట, వెంటనే ఒప్పేసుకున్న ఈ భామ వెంటనే సైన్ చేసిందట. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైందని చెబుతున్నారు. తితిలీ లాంటి సినిమాని తెరక్కించిన కాను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆగ్రా అనే టైటిల్‌ ని ఫిక్స్ చేసిందట సినిమా యూనిట్. ఏడుగురు వ్యక్తుల జీవితాలను కలిపేలా ఈ సినిమా కధ ఉంటుందట. ఆ ఏడుగురిలో రుహానీ ఒకరిగా నటించనుందట. అయితే ఈ సినిమాలో ఆమె చేసే పాత్ర కోసం రుహానీని ఎన్నో సార్లు ఆడిషన్ చేశారట.

More Related Stories