English   

పూరీ ఫ్యాన్స్ కి సడన్ షాక్ 

iSmart Shankar
2019-06-22 14:17:42

పూరీ ఫ్యాన్స్ కి సడన్ షాక్, అదేంటి ఇప్పుడు పూరీ ఫ్యాన్స్ కి సడన్ షాక్ అని అనుకుంటున్నారా ? నిజానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేష్ ల కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా రిలీజ్ కి సిద్దమయ్యింది. ఇప్పటికే ఈ షూట్ పూర్తి చేసి రిలీజ్ చేయాలనే తొందరలో ఉన్న పూరీ జగన్నాధ్ కి కొత్త చిక్కు వచ్చిపడింది.  అదే వరల్డ్ కప్, వరల్డ్ కప్ ఈ సినిమాకి అడ్డం పడడం ఏమిటి అనుకుంటున్నారా ? ఈ సినిమాని జూలై 12న విడుదల చేస్తున్నట్లు గతంలోనే ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. కానీ ప్రస్తుతం వరల్డ్‌ కప్‌ ఫీవర్‌ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేయడం మంచిది కాదని ఈ సినిమాని వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ ఏడాది వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ 14న జరుగుతుండటంతో ఆ తరువాతే రిలీజ్‌ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జూలై 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని విశ్లేషకుల విశ్లేషణ. ఇక పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ అలాగే పూరీల కెరీర్ కి చాలా ముఖ్యం, ఏమి జరగునుందో చూడాలి మరి.

More Related Stories