English   

విజయ్ దేవరకొండ భలే ప్లాన్ చేస్తున్నాడే ?

 Dulquer Salmaan
2019-06-22 16:42:03

విజయ్ దేవరకొండ కెరీర్ లో ప్రతీ అడుగుని ఆచి తూచి వేస్తున్నారు. తెలుగులో అతి తక్కువ టైమ్ లోనే లైం లైట్ లోకి వెళ్ళిన విజయ్. ఇప్పుడు మిగతా భాషలలో కూడా తన మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే తమిళంలో కాస్త ఫ్యాన్ బేస్ తెచ్చుకున్న ఆయన ఎటూ కన్నడలో రష్మిక మార్కెట్ ఉంది కాబట్టి తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ తో మలయాళ బాష మీద కూడా తన ద్రుష్టి పెట్టారు. అందులో భాగంగా మళయాళ వెర్షన్ కోసం దుల్కర్ ని లైన్ లోకి తెచ్చారు. నిజానికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌హాన‌టి చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ కెమెరా మెన్ పాత్ర‌లో న‌టిస్తే, దుల్క‌ర్ స‌ల్మాన్ జెమినీ గణేషన్ పాత్ర‌లో క‌నిపించారు. ఆ సినిమాప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఆ చనువుతో తన తాజా చిత్రం  `డియ‌ర్ కామ్రేడ్‌`  లో  దుల్కర్ చేత ఓ పాట పాడించారు విజయ్ దేవరకొండ. దుల్క‌ర్ మంచి న‌టుడే కాదు మంచి సింగర్ కూడా. గతంలో ఆయన పాడిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. దాంతో మళయాళ మార్కెట్ పెంచుకునేందుకు దుల్కర్ ని లైన్ లోకి తెచ్చాడు విజయ్. డియ‌ర్ కామ్రేడ్‌  చిత్రం ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలోనూ జూలై 26న విడుదల కానుంది. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను ఒకే రోజున విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

More Related Stories