English   

టీజర్ కంటే ముందుగా వాల్మీకి ప్రీ రిలీజ్ టీజర్

Valmiki
2019-06-22 17:07:02

వ‌రుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే, తమిళంలో గత ఏడాది రిలీజయిన జిగర్తాండ అనే సినిమాకి ఈ సినిమా తెలుగు రీమేక్. కార్తీక్ సుబ్బరాజ్ దైరేఖస్న్ లో వచ్చిన ఈ సినిమాలో బాబీసింహా పోషించిన నెగటివ్ రోల్ ని వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను తమిళ నటుడు అధర్వ మురళి చేస్తున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారవగా త్వరలోనే ఈ సినిమా ప్రీ-టీజర్‌ను విడుదలచేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తామని రంజాన్ రోజున దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించారు. ఆయన చెప్పినట్టుగానే వాల్మీకి ప్రీ రిలీజ్ టీజ‌ర్ ని జూన్ 24 సాయంత్రం 5:18ని.ల‌కి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మళ్ళీ ఈరోజు ఒక పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. 14రీల్స్ బ్యానర్ పై ఆచంట రాము, గోపినాథ్ లు నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల కావడానికి సిద్దమవుతోంది.

More Related Stories