English   

దేవరకొండ తమ్ముడి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

dorasani
2019-06-22 19:48:19

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెరంగేట్రం చేస్తున్న సినిమా దొరసాని. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ద్వారా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మొన్న ఏబీసీడీ నిర్మించిన మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ మీద మధుర శ్రీధర్‌రెడ్డి, దేవరకొండల మేనమామ యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజయి సినిమా మీద అంచనాలు పెంచింది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఇక నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా జూలై 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈరోజు రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటిస్తూ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఒక ప్రేమకథ ఈ దొరసాని. నిజానికి పేద అబ్బాయి పెద్దింటి అమ్మాయిని ప్రేమించడం అనే జోనర్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడమే ఈ సినిమా ప్రత్యేకత. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో ?

 

More Related Stories