ఛోటా కె నాయుడు మారడా ? మొన్న కాజల్...నిన్న తమన్నా

ప్రముఖ తెలుగు సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అయితే ఆయన ఈ మధ్య కాలంలో తన పనితనంతో కాక అనవసర విషయాల వలన మీడియాలో హైలైట్ అవుతున్నారు. గత ఏడాది ‘కవచం’ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో పబ్లిగ్గా కాజల్ అగర్వాల్‌కు ముద్దు పెట్టేసి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా మారని ఈయన రాజు గారి గది-3 మూవీ లాంచ్ సమయంలో హీరోయిన్ తమన్నాతో ప్రవర్తించిన తీరు మళ్ళీ వివాదాస్పదమవుతోంది. ఆ రోజున జరిగిన కార్యక్రమంలో తమన్నా పక్కనే నిలబడ్డ ఛోటా కె నాయుడు తమన్నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఎంతకీ విడిచిపెట్టలేదు దీంతో ఇబ్బంది పడిన తమన్నా కొంచెం చేతిని విడిపించుకోవాలని చూసినా ఆయన గట్టిగా అలాగే పట్టుకోవడం వీడియోలో కనిపించింది. అప్పుడు కాజల్ లాగే తమన్నా సైతం తన అసహనాన్ని బయటికి చూపించకుండా నవ్వుతూనే ఉంది. నిజానికి ఛోటాకు అమ్మాయిల విషయంలో ఇలాంటి కోతి పనులు ఎక్కువనే విషయం ముందు నుంచే ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఛోటానే ఒప్పుకున్నాడు. ఏదయినా ఆఫ్ కెమెరా ఉన్నంతవరకే ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా కెమెరాకి చిక్కితే ఎంత ఇబ్బందో ఈ కెమెరామెన్ కి ఇప్పటికయినా తెలుస్తుందో లేదో ?