English   

అల్లు బావకి అనుకోని గిఫ్ట్ ఇచ్చిన నవదీప్

Allu Arjun
2019-06-23 11:21:31

అల్లు అర్జున్‌, న‌వదీప్ మంచి స్నేహితుల‌న్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రు ఆర్య 2 సినిమాలో క‌లిసి న‌టించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్, ఇక ఆ సినిమా తర్వాత నటుడుగా నవదీప్ పెద్దగా కనిపించకపోయినా వారి మధ్య సాన్నిహిత్యం మాత్రం అలాగే ఉంది. ఈ మధ్యనే న‌వదీప్ స్థాపించిన ఒక సినిమా సంబందిత సంస్థ‌ని బ‌న్నీ స్టార్ట్ చేశారు కూడా. ఇక ఈ మధ్య న‌వ‌దీప్ బన్నీకి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన‌ట్టు బన్నీ తన సోష‌ల్ మీడియాలో ప్రకటించారు. ఆ గిఫ్ట్ ఎంటంటే రుద్ర‌మ‌దేవి చిత్రంలో గోన‌గ‌న్నారెడ్డి పాత్రలో ఉన్న బ‌న్నీని హ్యాండ్ సైజ్ స్టాచ్యూని చేయించి బ‌హుమ‌తిగా ఇచ్చాడు న‌వ‌దీప్‌. బావ‌కి ప్రేమ‌తో ఓ చిరు కానుక అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు న‌వ‌దీప్‌. దీనికి బ‌న్నీ త‌ను అందుకున్న స్వీటెస్ట్ గిఫ్ట్ అని, థాంక్యూ బావా అంటూ ఆ బుల్లి విగ్రహం బొమ్మని సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. రుద్ర‌మదేవి చిత్రంలో అల్లు అర్జున్ బందిపోటు గోన గన్నారెడ్డిగా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాడు ఆయన చెప్పిన  "నేను తెలుగుభాష లెక్క‌, ఆడా ఉంటా, ఈడా ఉంటా" అని డైలాగు ఇప్ప‌టికి అభిమానుల నోట నానుతూనే ఉంటుంది. 

More Related Stories