ఆర్ఆర్ఆర్ కి మరో అడ్డంకి

తెలుగు టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో చరణ్ లు కధానాయకులుగా భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ - కొమరం భీమ్ గా, చరణ్ - అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ లు గాయపడ్డ కారణంగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌కి కొన్ని వారాల పాటు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కోలుకోవడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మరో అనుకోని ఇబ్బంది ఎదురయినట్టు సమాచారం. హీరోలు ఇద్దరికీ ఆరోగ్యం బాగయ్యిందని అనుకుంటే ఇప్పుడు ఈ సినిమాలో ఒక హీరోయిన్ అయిన అలియా భట్ ఆరోగ్య సమస్యలతో షూటింగ్ కి రాలేకపోయింది. ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ షెడ్యూల్లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ జాయిన్ కావాల్సింది. కాని అలియా కొద్ది రోజులుగా పేగులకి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడంతో విశ్రాంతి తీసుకుంటుంది. న్యూయార్క్‌లో చికిత్స తీసుకునేందుకు కూడా ఆమె వెళుతోంది. రాజమౌళి ఇక చేసేదేమి లేక ఆర్ఆర్ఆర్ చిత్ర షెడ్యూల్స్‌లో పలు మార్పులు చేస్తు, అలియా లేని సీన్స్ ని షూట్ చేస్తున్నారట. పలు బాషల స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాను 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. జూలై 30 2020లో ఈ సినిమాను విడుదల చేయ డానికి ప్లాన్ చేస్తూన్నారు.