English   

నాగచైతన్యకి జోడీ కీర్తి అట ?

Naga Chaitanya
2019-06-23 11:36:17

ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. చాలా మంది హీరోలు కొత్త కథలతో రిస్క్ చేయడం ఎందుకని వాళ్ల పాత సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే నాగార్జున, మన్మధుడు సినిమాకి మన్మధుడు, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య తాత మనవళ్లుగా నటిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. 2016 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా 'బంగార్రాజు' అనే టైటిల్‌తో ఓ సినిమాని కళ్యాణ్ కృష్ణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు వేగవంతంగా నడుస్తున్న్నాయి. అయితే ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణనే అనుకుంటుండగా, నాగ చైతన్య సరసన సమంతా నటించనుందని కూడా వార్తలు వచ్చాయి, అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో నాగ చైతన్య సరసన కీర్తి సురేష్‌ను ఎంపిక చేయాలని చూస్తోందట చిత్ర యూనిట్. అయితే ఇది ఊహాగానమే కాగా ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక నాగ్ నటిస్తున్న మన్మధుడు 2 సినిమాలో కూడా కీర్తి సురేష్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగ చైతన్య కీర్తి కలిసి మహానటిలో నటించారు. ఆ సినిమాలో సావిత్రిగా కీర్తి, తాత అక్కినేనిగా నాగ చైతన్య నటించారు.

More Related Stories