English   

డబ్బులు ఇస్తే దేనికైనా రెడీ అంటున్న రష్మి గౌతమ్..

rashmi
2019-06-23 17:07:05

మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది మనసుకు నచ్చి ఉండాలి లేదంటే దాంతో డబ్బులు అయినా బాగా వస్తూ ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి కచ్చితంగా అయి ఉండాలి. అలా కాకుండా మనసుకు నచ్చక డబ్బులు రాక పని చేస్తే అది వృథా. ఈ విషయంలో రష్మి గౌతమ్ అందరికంటే చాలా ముందుంది. తాను ఒక పని చేస్తున్నప్పుడు లేదంటే ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు కచ్చితంగా దాంట్లో క్రియేటివ్ శాటిస్ఫ్యాక్షన్ అయినా రావాలి లేదంటే డబ్బులు బాగా రావాలని చెబుతుంది. ఈ రోజుల్లో తాను నటిగా నిరూపించుకోవడానికి ఛాలెంజింగ్ పాత్రలు అయితే ఎవరూ తీసుకు రావడం లేదని ఓపెన్గానే చెబుతుంది రష్మి గౌతమ్. ఎంతసేపు గ్లామర్ పాత్రలతో దర్శకులు వస్తున్నారు అంటూ సంచలన సమాధానం చెబుతుంది ఈ జబర్దస్త్ యాంకర్. తాను కూడా అందులో తప్పేం లేదు అన్నట్లు అన్ని అలాంటి సినిమాలు చేస్తున్నానని చెబుతోంది రష్మీ. నటిగా నిరూపించుకోవాలని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తనకు కూడా ఉంటుందని.. కానీ దర్శకులు అలాంటి పాత్రలు తీసుకున్నప్పుడు తాను మాత్రం ఏం చేస్తాను అంటోంది ఈ ముద్దుగుమ్మ.
అందుకే క్రియేటివ్ శాటిస్ఫ్యాక్షన్ ఎలాగూ లేదు కాబట్టి డబ్బులు అయినా బాగా రావాలి కదా అంటూ అందాల ఆరబోతకు తెర తీసినట్లు చెబుతున్నారు రష్మి గౌతమ్. ఒకవేళ అలాంటి పాత్రలే కాకుండా తన మనసుకు నచ్చిన పాత్రలు వస్తే రెమ్యూనరేషన్ తక్కువ తీసుకొని నటించడానికి కూడా తన సిద్ధంగానే ఉన్నానని చెబుతోంది రష్మీ. అలాంటి పాత్రలు రావడం లేదు కాబట్టి డబ్బులు ఎక్కువగా తీసుకుని గ్లామర్ రోల్స్ చేస్తున్నానని ఓపెన్ అయిపోయింది ఈ బ్యూటీ. ఒకప్పుడు రష్మి గౌతమ్ తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదు.. కానీ జబర్దస్త్ యాంకర్ అయిన తర్వాత ఈయనకు క్రేజ్ పెరిగిపోయింది.. ఆ తర్వాత గుంటూరు టాకీస్ సినిమా తో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. అప్పటి నుంచి అన్ని బి గ్రేడ్ సినిమాలకు తక్కువ కాని గ్లామర్ షో చేస్తూ బండి నెట్టుకొస్తోంది రష్మి గౌతమ్. త్వరలోనే తన మనసుకు నచ్చినట్లు వెబ్ సిరీస్ చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో డబ్బులు రావని తెలిసినా కూడా తన మనసుకు నచ్చిన పనిని అదే అంటుంది రష్మి గౌతమ్.

More Related Stories