English   

బిగ్ బాస్ కి లాస్య ఎందుకు వెళ్తుందో ?

lasya
2019-06-23 17:44:17

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి అంతా సిద్దమవుతోంది. ఇప్ప‌టికే ప‌లు ప్రోమోల‌తో ఈ సీజన్ బిగ్ బాస్ షో మీద స్టార్ మా అంచనాలు పెంచుతుంది. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ మీలో కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మంతో బుల్లితెర ప్రేక్ష‌కులని అల‌రించిన నాగ్ ఈ సారి బిగ్ బాస్ సీజ‌న్ 3ని హోస్ట్ చేయ‌నున్నాడని అనధికారికంగా ఫిక్స్ చేసినట్టే. దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ లో  కంటెస్టెంట్స్‌గా ఎవ‌రు ఉంటార‌న్న‌ చ‌ర్చ‌ మొదలయ్యిది. జూలైలో ప్రారంభం కానున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ ప‌లువురి జాబితా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. తొలి రెండు సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ ని ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఇంఈ సీజన్ లో రేణు దేశాయ్ తో పాటు యాంకర్‌ ఉదయభాను, యాంకర్‌ రష్మి, గాయకుడు హేమచంద్ర, జబర్ధస్త్‌ ఫేమ్‌ సుధాకర్‌, యాంకర్‌ లాస్య, యాంకర్‌ రవి, యూట్యూబ్‌ స్టార్‌ మహాతల్లి, వీ6 యాంకర్‌ సావిత్రి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో అందరి పేర్లూ బాగానే ఉన్నా లాస్య పేరే కష్ట ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఆమె ఏప్రిల్ నెలలోనే బిడ్డకి జన్మనిచ్చింది, ఆమె బిడ్డతో ఉండడం చాలా అవసరం అలాంటిది ఆమె పేరు ఎందుకు వైరల్ అవుతుందో అర్ధం కాని విషయం. 

More Related Stories