English   

రాక్షసుడు కూడా ఇస్మార్ట్ తో పాటే ?

sai
2019-06-23 19:05:59

హిట్టు కోసం విక్రమార్క ప్రయత్నం చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్ ఫేం రమేశ్ వర్మ డైరెక్టర్ గా రాక్షసుడు సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఏ స్టూడియోస్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. హీరో హవీశ్‌ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సినిమా రాచ్చాసన్ కి తెలుగు రీమేక్ గా తెరెక్కుతున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోంది. ఇక ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా ఫ్యాన్సీ రేట్ చెల్లించి మరీ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫాం చేసుకుంది. ఈ సినిమాని వచ్చే నెల 18న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కధ ప్రకారం  స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్లపై అత్యాచారం చేసి హత్య చేసే ఒక సైకో, ఆ సైకోను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసే ప్రత్యేక పోలీస్ అధికారిగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. సాహో సినిమాకి సంగీతం అందిస్తున్న గిబ్రాన్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఇదే రోజు ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకి గట్టి పోటీ తప్పదు అనిపిస్తోంది. పాపం బెల్లంబాబు పరిస్థితి ఏంటో ?

More Related Stories