English   

బిగ్ బాస్ కౌశల్ సంచలన నిర్ణయం 

Kaushal Manda
2019-06-24 08:17:21

హన్మకొండలో ఇటీవలే తొమ్మిది నెలల చిన్నారి మీద ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కామంతో కళ్ళు మూసుకు పోయిన ఆ యువకుడు ఆ పసిపాప మీద అత్యాచారం చేసి చంపేశాడు. ఈ ఘటన మీద ప్రజల నుండి ఆగ్రహ ఆవేశాలు పెల్లుబికుతున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన ప్రవీణ్‌ ని కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. అ మానవ మృగాన్ని ఏకంకా కొట్టి చంపేయాలని జనం చూశారంటే వారి బాధ మనం అర్ధం చేసుకోవచ్చు. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఆ పాపకు న్యాయం జరగాలంటే ఆ రాక్షసుడ్ని శిక్షించాలని కోరుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హన్మకొండలో 9 నెలల చిన్నారి శ్రీహితకు అన్యాయం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఆమెకు సరైన న్యాయం జరగనందున ఆమరణ దీక్ష చేయబోతున్నానని ప్రకటించాడు కౌశల్. నిన్న పాప తల్లిదండ్రుల్ని కలుసుకుని అక్కడ నుండి మెజిస్ట్రేట్ ఎదురుగా ఆమరణదీక్ష చేయాలనుకున్నట్టు తెలిపారు. పాపకి న్యాయం కావాలని కోరుకుంటారో వారంతా ఈ నిరాహారదీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అయితే నిరాహారదీక్ష చేస్తున్నట్టు ముందుగా ప్రకటించిన మళ్ళీ వరంగల్ వెళ్లి పాప కుటుంబాన్ని కలుసుకున్నామని ఆమె చనిపోయిన 11 రోజుల లోపే నిందితుడ్ని శిక్షిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు హామీ వచ్చిందని పాప తండ్రి జగన్ చెప్పారని అందుకే నిరాహారదీక్షను ఆపి వేచి చూస్తామని కౌశల్ ప్రకటించారు.

More Related Stories