English   

మా సమావేశంలో హేమ కన్నీరు..కాళ్ళుకి దండం పెట్టి అడుగుతున్నా....

Actress Hema
2019-06-24 08:40:37

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తొలి సర్వసభ్య సమావేశం నిన్న హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో జరిగింది. ఈ సమావేశానికి మాజీ అధ్యక్ష్యుడు శివాజీ రాజా సహా దాదాపు జనరల్ బాడీలో ఉన్న అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో నటి హేమ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. మహిళా ఆర్టిస్ట్ లు చాలా మంది ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళ ఇబ్బందులని తీర్చలేకపోయినా వేషాలు అయినా ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని ఆమె దర్శక నిర్మాతలను కోరారు. ముందు మన ఇంట్లో ఉన్న ఆడాళ్లకు తిండి పెట్టండని ఎక్కడో బయటి నుంచి లేడీ ఆర్టిస్టులను తీసుకువచ్చి తెలుగు ఆర్టిస్టులకు అన్యాయం చేయొద్దని ఆమె కోరారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లు వేషాల కోసం చాలా కష్టపడుతున్నారని వారి ఆకలి బాధను అర్ధం చేసుకోండని ఆమె కోరారు. మొత్తం మాలో 800 మంది ఉంటే అబ్దుకో వంద, నూటయాభై మంది మాత్రమే ఆడవాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అన్నం పెట్టి బట్టలు ఇవ్వలేమా ? జనరల్ బాడీ మీటింగ్‌లో కూడా ఎంతో మంది వేషాలు లేవని ఏడుస్తున్నారని ఆమె అన్నారు. మన అక్క చెల్లెల్ని మీడియాలో వేరే టైటిల్స్‌ పెట్టి వేసేలా చూడద్దు అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దర్శకులు, నిర్మాతలు మన తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వండి..మీ కాళ్లకు దండం పెట్టి అడుగుతున్నా ప్లీజ్ మన తెలుగు అమ్మాయిలకు వేషాలు ఇవ్వండని కన్నీరు పెట్టుకున్నారు ఆమె.  

More Related Stories