English   

మళ్ళీ అదృష్టం పరీక్షించుకోనున్న పూజా

Pooja Hegde
2019-06-24 10:43:52

ముకుంద సినిమాతో తెలుగు సినిమా తెరంగ్రేటం చేసిన పూజా హేగ్దే, చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే చాలా కాలం పాటు ఆమెని ఐరెన్ లెగ్ గా ముద్ర వేశారు. అయితే ఆమె అప్పటికే ఒక మారు బాలీవుడ్ లో లక్ చెక్ చేసుకున్నా అది వర్కువుట్ కాలేదు. హృతిక్ లాంటి హీరో సరసన నటించినా ఆమెకి అదృష్టం అంతగా కలసి రాలేదు, ఆ తర్వాత అక్షయ్‌కుమార్‌ 'హౌస్‌ఫుల్‌ 4' సినిమా చేసినా అది కూడా ఆమెకి పేరు తెచ్చిపెట్టలేదు. దీంతో మరో మారు ఆమె బాలీవుడ్ లో లక్ పరీక్షించుకోవడానికి సిద్దమవుతోంది. సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో హిందీలో 'ముంబై సాగ' అనే ఓ గ్యాంగ్‌స్టర్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్‌ అబ్రహాం, ఇమ్రాన్‌ హష్మి హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేని తీసుకున్నారని చెబుతున్నారు. జాకీష్రాఫ్, సునీల్‌ శెట్టి, ప్రతీక్‌ బబ్బర్‌ లాంటి స్టార్ క్యాస్టింగ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయ డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్‌ తో రాధాకృష్ణ మూవీ, అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

More Related Stories