English   

బాలయ్యకి హీరోయిన్ ఫిక్స్ 

 Shriya Saran
2019-06-24 13:08:43

బాలకృష్ణ హీరోగా ఆయన 105వ సినిమా తమిళ్ సూపర్ హిట్ డైరెక్టర్ గా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. అయితే ఈ సినిమాలో బాల‌కృష్ణ సరసన నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఈ సినిమా కోసం మెహ‌రీన్‌, పాయ‌ల్ రాజ్ పుత్ లాంటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కూడా. అయితే మరి ఒప్పుకోలేదో లేక డేట్స్ లేవో కానీ ఇప్పుడు ఆయనకీ త్వరగా హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు యూనిట్. ఈ క్రమంలో న‌య‌న‌తార‌, కాజ‌ల్‌, శ్రియ‌ల‌లో ఒక‌రిని ఎంచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. అయితే ఇప్పుడున్న టైట్ షెడ్యూల్ ప్రకారం న‌య‌న్ తెలుగు సినిమాల్ని ఒప్పుకునే ప‌రిస్థితిలో లేదు. మరోపక్క పెద్దగా హిట్స్ లేకున్నా కాజ‌ల్ కోటికి త‌క్కువ తీసుకోవ‌డం లేదు. దీంతో శ్రేయ మీద ద్రుష్టి పెట్టారు సినిమా యూనిట్. నిజానికి వీరిద్దరూ చెన్న‌కేశ‌వ‌రెడ్డి, గౌత‌మీపుత్ర శాతక‌ర్ణి, పైసా వ‌సూల్ సినిమాల్లో కలిసి నటించారు. అందుకే శ్రియ‌ని ఫైనల్ చేయాల‌ని అనుకుంటున్నారట. శ్రియ కూడా ప్ర‌స్తుతం చాలా ఖాళీగా ఉంది. దీంతో ఆమెనే ఫైనల్ చేశారట. త్వరలోనే ఈ విషయం మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.

More Related Stories