English   

నితిన్ ఇలా రెచ్చిపోతున్నాడేంటి.. ఇంకా ఎన్ని లైన్లో ఉన్నాయి..

 RANG DE
2019-06-24 14:15:29

సరిగ్గా నెలరోజుల కింద వరకు నితిన్ ఖాళీగా ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణం సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఎక్కడ బయట కూడా కనిపించలేదు. భారీ ఆశలు పెట్టుకున్న ఆ సినిమా ఊహించిన విధంగా పరాజయం పాలవడంతో నితిన్ బయటకు కూడా రాలేదు. దానికితోడు ఆయన భుజానికి కూడా శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. దాంతో చాలా రోజుల పాటు ఇంటికే పరిమితం అయిపోయాడు నితిన్. ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత కొత్త సినిమాలతో వరుసగా బిజీ అయిపోతున్నాడు ఈ కుర్ర హీరో. నెల రోజుల కింద వెంకీ కొడుకుల దర్శకత్వంలో భీష్మ సినిమాను పట్టాలెక్కించాడు ఈయన. రష్మిక మందన్న ఈ సినిమా నితిన్ తో రొమాన్స్ చేస్తుంది. పెళ్లంటే కిలోమీటర్ దూరం పారిపోయే యువకుడి పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఇలా ఉండగానే చంద్రశేఖర్ ఏలేటి సినిమాకు కూడా ముహూర్తం పెట్టాడు నితిన్. 

భవ్య క్రియేషన్స్ సంస్థలో ఆనంద్ ప్రసాద్ ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నితిన్ సినిమా కూడా అలాగే ఉండబోతుంది. రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ముహూర్తం పెట్టి 24 గంటలు కూడా గడవకముందే వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే సినిమా కొబ్బరికాయ కొట్టాడు నితిన్. ఇందులో మహానటి కీర్తి సురేష్ ఈ కుర్రహీరోకు జోడీగా నటిస్తోంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్ లో రంగ్ దే సినిమా విడుదల కానుంది. మిస్టర్ మజ్ను తర్వాత వెంకీ అట్లూరి మరోసారి ప్రేమకథతోనే వస్తున్నాడు. మొత్తానికి కొన్ని రోజుల గ్యాప్ తీసుకున్న కూడా వరుస సినిమాలు చేస్తూ నితిన్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నారు. మరి ఇందులో ఆయన కోరుకుంటున్న విజయం ఏ దర్శకుడు అందిస్తాడనేది ఆసక్తి కరంగా మారింది.

More Related Stories