English   

షూట్ లో గాయపడిన స్టార్ హీరోయిన్ 

Anushka Shetty
2019-06-24 15:00:34

వరుస ప్రమాదాలు జరుగుతున్న టాలీవుడ్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు కుర్ర హీరోలు వరుసగా ప్రమాదాలు బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ వరుస ప్రమాదాలకి బ్రేక్ పడింది అనుకునే లోపు ఒక స్టార్ హీరోయిన్ కి ప్రమాదం జరిగింది. సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న హీరోయిన్ అనుష్క గాయపడిందని సమాచారం. తెలుగు స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అనుష్క ఝాన్సీ గా కనిపించనున్నారు. ఆమె సినిమాలో ఇరవై నిమిషాల పటు కనిపిస్తారట. గాంధీ జయంతిన అక్టోబర్‌ 2న విడుదల కానున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. అయితే యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేసేప్పుడు ఆమె కాలికి ఫ్యాక్చర్ అయ్యిందట. గాయం అవ్వగానే పెద్దగా హంగామా చేయకుండా ఆమె చాలా హుందాగా ప్రవర్తించిందట. అందుకే ఆమెకు అయిన గాయం గురించి బయటకు రాలేదట. గాయానికి చికిత్స చేసిన డాక్టర్లు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే నయమైపోతుందని చెప్పారట. ఏదేమైనా ఆమె అలా ప్రవర్తించడం అంటే మామూలు విషయం కాదు కదా. 

More Related Stories